నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్..

by Sumithra |
నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్..
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని పులాంగ్ ప్రాంతంలో పేకాట స్థావరం పై ఆదివారం పోలీసులు దాడులు నిర్వహించి నలుగురు పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి సమయంలో పులాంగ్ ప్రాంతంలో కొందరు పేకాట ఆడుతున్నారని తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు రైడ్ నిర్వహించి నలుగురిని అరెస్టు చేసినట్లు ఫోర్త్ టౌన్ ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. వారి నుంచి రూ.15,400 లు నగదు, పేక ముక్కలను స్వాధీన పరుచుకుని వారి పై కేసునమోదు చేశామన్నారు.

Advertisement

Next Story

Most Viewed