లోన్‌యాప్స్ కారణంగా యువత ఆత్మహత్య.. రాష్ట్ర హోంశాఖ కీలక నిర్ణయం

by Gantepaka Srikanth |
లోన్‌యాప్స్ కారణంగా యువత ఆత్మహత్య.. రాష్ట్ర హోంశాఖ కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో లోన్‌యాప్స్‌ను యువత ఎక్కువగా వాడుతున్నారు. యాప్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోకుండానే డబ్బులు అత్యవసరమై.. లోన్ తీసుకొని వాడేసుకుంటున్నారు. అనంతరం డబ్బులు కట్టలేక చివరకు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి తెచ్చుకుంటున్నారు. దీంతో లోన్‌యాప్స్ కారణంగా రాష్ట్రంలో యువత ఆత్మహత్యలు చేసుకోవద్దని హోం మంత్రి వంగలపూడి అనిత సూచించారు. శనివారం విజయవాడలో సైబర్ క్రైమ్ అవేర్‌నెస్ వాకథాన్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని అన్నారు. పెరిగిన టెక్నాలజీ కారణంగానే నేరాలు సైతం పెరిగాయని తెలిపారు. ముఖ్యంగా యువత లోన్‌యాప్స్ మీద ఎక్కువగా ఆధారపడుతున్నారని.. ఈ కారణంగానే ఆత్మహత్యల వరకూ వెళ్తున్నారని అన్నారు. అందుకే ప్రతి జిల్లాలో సైబర్ సెల్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.




Advertisement

Next Story

Most Viewed