- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
గంజాయి ముఠా గుట్టు రట్టు..ఐదుగురి అరెస్ట్
దిశ, జగిత్యాల టౌన్ : అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను జగిత్యాల జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ అశోక్ కుమార్ వివరాలు వెల్లడించారు. అరెస్ట్ చేయబడిన వారిలో పూడూరు గ్రామానికి చెందిన ఎడమలపల్లి సాయికుమార్, తుడుం సాయి తేజ, కందుల అరుణ్, గౌరాపూర్ కు చెందిన ఎడపల్లి సాకేత్ తో పాటు ధరూర్ కు చెందిన పాల రాజ్ కుమార్ ఉన్నారు. కాగా మరో నిందితుడు అఖిల్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
నిందితులు ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు నుంచి 16 కేజీల గంజాయి రూ. 43 వేలకు తీసుకువచ్చి అధిక రేట్లకు జగిత్యాల జిల్లాలో అమ్ముతున్నట్లుగా గుర్తించినట్లు తెలిపారు. అరెస్ట్ చేయబడిన నిందితుల నుండి 12 కేజీల గంజాయితో పాటు 5 సెల్ ఫోన్లు రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి ముఠా గుట్టు రట్టు చేయడంలో కీలకంగా వ్యవహరించిన జగిత్యాల డీఎస్పీ రఘు చందర్, మల్యాల సీఐ నీలం రవి, కొడిమ్యాల ఎస్సై సందీప్ ఇతర సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.