- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మాజీ ముఖ్యమంత్రికి తప్పిన ముప్పు.. భద్రతా సిబ్బందికి గాయాలు
by GSrikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: జమ్ముకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మహబూబా ముఫ్తీ కారు ప్రమాదానికి గురైంది. ముఫ్తీ కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముఫ్తీ కారు ముందు భాగం స్వల్పంగా డ్యామేజ్ కాగా, సురక్షితంగా ముఫ్తీ బయటపడ్డారు. ఆమె భద్రతా సిబ్బందికి స్వల్ప గాయాలు అయ్యాయి. అనంత్ నాగ్ జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఖానాబాల్ అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదం తర్వాత ఆమె మరో కారులో పరామర్శకు వెళ్లారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story