- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పసి బిడ్డతో సహా ఐదుగురు మృతి: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం
దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పురుషులు, వారి భార్యలు, ఇద్దరు పిల్లలతో కలిసి వడోదర జిల్లాలోని కర్జన్ తాలూకా నుంచి కారులో వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు వడోదర సమీపంలో రోడ్డు పక్కన ఆగి ఉన్న ట్రక్కును వేగంగా ఢీకొట్టింది. దీంతో ఇద్దరు దంపతులు సహా, ఏడాది వయసున్న చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. మరో మూడేళ్ల చిన్నారికి గాయాలైనట్టు పోలీసులు వెల్లడించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ టీమ్ మృతదేహాలను బయటకు తీశారు. మరణించిన వారిని ప్రజ్నేష్ భాయ్ పటేల్ (34), మయూర్‌భాయ్ పటేల్ (30), ఊర్వశిబెన్ పటేల్ (31), భుంబేన్ పటేల్ (28), లవ్ పటేల్ (1)గా గుర్తించారు. అయితే ఈ ఫ్యామిలీ సూరత్‌కు వెళ్లి తిరిగి వస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.