BIG BREAKINK : ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం

by Disha Web Desk |
BIG BREAKINK : ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం
X

దిశ,చౌటుప్పల్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలోని ఓం సాయి ప్లాస్టిక్ గోదాంలో అగ్నిప్రమాదం జరిగి భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ఈ గోదాంలో ప్లాస్టిక్ వస్తువులు భారీ స్థాయిలో నిలువ చేసి ఉండడంతో మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్ సాయంతో మంటలు ఆర్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి హాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్ని ప్రమాదాన్ని గల కారణాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed