- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యుత్ సర్వీస్ వైర్లు సరిచేస్తుండగా కరెంటు షాక్
![విద్యుత్ సర్వీస్ వైర్లు సరిచేస్తుండగా కరెంటు షాక్ విద్యుత్ సర్వీస్ వైర్లు సరిచేస్తుండగా కరెంటు షాక్](https://www.dishadaily.com/h-upload/2024/09/14/371045-raitu.webp)
దిశ, నాగిరెడ్డిపేట్ : విద్యుత్ షాక్ తగిలి ప్రమాదవశాత్తు రైతు మృతి చెందిన ఘటన మండలంలోని ధర్మారెడ్డి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై మల్లారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ధర్మారెడ్డి గ్రామానికి చెందిన జోడు కృష్ణ (45) అనే రైతు శుక్రవారం రాత్రి తన పంట పొలంలోకి వెళ్లి వస్తానని చెప్పి తిరిగి రాలేదు. దాంతో శనివారం ఉదయం కృష్ణ భార్య సునీత స్థానికులతో కలిసి వెతకగా అదే గ్రామానికి చెందిన జోడు నారాయణకు చెందిన పంట పొలంలో మృతి చెంది కనిపించాడు.
నారాయణ బోరు మోటార్ వద్ద విద్యుత్ సర్వీస్ వైర్లు సరిచేస్తుండగా కృష్ణ కుడి చేతికి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
- Tags
- Electric shock