- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పక్కా సమాచారం...అడ్డంగా దొరికిన నిందితులు
by Sridhar Babu |

X
దిశ, నేరడిగొండ : పక్కా సమాచారంతో గంజాయి తరలిస్తున్న వ్యక్తి అడ్డంగా దొరికాడు. గంజాయి తరలిస్తున్న ఓ వ్యక్తిని ఇచ్చోడ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు మండలంలోని దుబార్ పేట్ వంతెన వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ మేరకు సిరికొండ మండలం కొండపూర్ గ్రామానికి చెందిన ఠాకూర్ ప్రతాప్ సింఘ్ ను తనిఖీ చేయగా అతని వద్ద 1.5 కేజీల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అతడు ఇంద్రవెళ్లి మండలానికి చెందిన సునీల్ అనే వ్యక్తి వద్ద గంజాయిని తక్కువ ధరకు కోనుగోలు చేసి ఎక్కువ ధరకు అమ్ముటకు తన మోటార్ సైకిల్ పై తీసుకొని వస్తున్నాడని తెలిపారు. గంజాయి విలువ రూ: 38 వేల వరకు ఉంటుందని సీఐ భీమేష్ తెలిపారు. కేసు నామోదుచేసి నిందితుడిని రిమాండ్కు తరలించామన్నారు.
- Tags
- Marijuana
Next Story