Cylinder Blast: బాలికల హాస్టల్‌లో పేలిన సిలిండర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

by Shiva |   ( Updated:12 Sept 2024 6:11 AM  )
Cylinder Blast: బాలికల హాస్టల్‌లో పేలిన సిలిండర్.. ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: బాలికల హాస్టల్‌లో సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందిన ఘటన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో హాస్టలోని కిచెన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయంతో విద్యార్థునులంతా బయటకు పరుగులు తీశారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది చేలరేగుతున్న మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ దుర్ఘటనలో పరిమళ, శరణ్య అనే మహిళా సిబ్బంది మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. మరో ముగ్గురు విద్యార్థినులకు తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed