ఏసీబీ వలలో అవినీతి తిమింగలాలు

by Sridhar Babu |
ఏసీబీ వలలో అవినీతి తిమింగలాలు
X

దిశ కరీంనగర్ టౌన్ : కరీంనగర్ డీసీఎంఎస్ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు నిర్వహించిన మెరుపుడుల్లో ఆ సంస్థ మేనేజర్, క్యాషియర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటులో మేనేజర్ వెంకటేశ్వరరావు, క్యాషియర్ కుమారస్వామి ఇద్దరు అధికారులు బాధితుడు కావటి రాజుకి రావలసిన బిల్లును మంజూరు చేయాలంటే లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు కరీంనగర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా, అధికారుల బృందం డీసీఎంఎస్ కార్యాలయంలో దాడులు నిర్వహించి అధికారులు ఇద్దరినీ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.

బాధితుడు 2018 ఖరీఫ్ సీజన్ నుండి డీసీఎంఎస్ సంస్థతో ఫ్యాడి కలెక్ట్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీని ద్వారా వచ్చిన డబ్బులు 50 శాతం సంస్థకు, మరో 50 శాతం ప్యాడి నిర్వహణకి ఇవ్వాల్సి ఉంటుంది. బాధితుడు 2018 నుండి నేటి ఖరీఫ్ సీజన్ వరకు మొత్తం కలిసి రూ.90 లక్షల పదహారు వేల 400 కమిషన్ సంస్థ నుండి రావాల్సి ఉంది. కమీషన్ కోసం బాధితుడు పలుమార్లు సంస్థ కార్యాలయం అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. మేనేజర్, క్యాషియర్ ఇద్దరూ నీకు రావలసిన బిల్లు కావాలంటే మాకు లంచం ఇస్తేనే మీ బిల్లు పాస్ చేస్తామంటూ బాధితుడిని ఇబ్బందులకు గురి చేశారు. అధికారుల తీరుపై విసుగొచ్చిన బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో, రంగంలోకి దిగిన అధికారులు చాకచక్యంగా పట్టుకుని కేసు నమోదు చేశారు.

Next Story

Most Viewed