- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
BREAKING: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పేరుతో సైబర్ నేరగాళ్ల వల.. బ్యాంకు ఖాతాలో రూ.29 లక్షలు హాంఫట్

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా క్యాష్ పేమెంట్స్ నిలిచిపోయి, ఆన్‌లైన్ పేమెంట్స్ కొనసాగుతుండటంతో వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అనే తేడా లేకుండా అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో సైబర్ నేరగాళ్లు ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేస్తూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు. క్యూఆర్ కోడ్స్, లింకులతో జనాల వద్ద ఉన్న సొమ్మును దర్జాగా కాజేస్తూ.. హాయిగా చెక్కేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో ఓ ప్రైవేటు పాఠశాలలో పని చేసే ఉపాధ్యాయురాలిని సైబర్ కేటుగాళ్లు నిలువునా ముంచేశారు.
ముందుగా ఆమెతో పరిచయం పెంచుకున్న నేరస్తులు ఓ వాట్సప్ గ్రూప్‌లో యాడ్ చేశారు. ఆ తరువాత ఓ యాప్‌కు ఆమె ఫోన్లో ఇన్‌స్టాల్ చేయించారు. ఇక నేరగాళ్లు చెప్పినట్లుగా ఆ ఉపాధ్యాయురాలు యాప్ ద్వారా సుమారు 29.10 లక్షల నగదును డిపాజిట్ చేసింది. అనంతరం యాప్ ఇన్‌స్టాల్ చేయించిన సైబర్ నేరగాళ్లు స్పందించకపోవడంతో తాను మోసపోయినట్లుగా గ్రహించింది. చేసేదేమి లేక సదరు మహిళ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.