- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: జలవిహార్ వద్ద పోలీసుల విస్తృత తనిఖీలు.. భారీగా డ్రగ్స్ పట్టివేత, ముగ్గురు పెడ్లర్ల అరెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాను సమూలంగా నిర్మూలించేందుకు సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఈ మేరకు మాదక ద్రవ్యాలతో రెడ్ హ్యాండెడ్‌గా ఎవరు పట్టుబడినా.. వారిని కఠినంగా శిక్షించాలంటూ పోలీసు శాఖకు ఆదేశాలను జారీ చేసింది. ఈ మేరకు టాస్క్‌ఫోర్స్, ఇతర పోలీసు సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో వాహనాలను ఆపి క్షుణ్ణంగా తనిఖీ చేపడుతూ.. పెద్ద ఎత్తున గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకుని కేసులు బుక్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ హైదరాబాద్‌లోని జలవిహార్ వద్ద పోలీసులు తనిఖీలు చేపడుతుండగా.. అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న సాయి శరత్, శ్రవణ్, శ్రీవాస్తవను అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా వారి నుంచి రూ.3 లక్షల విలువ చేసే 11.34 గ్రాముల కొకైన్, 3.66 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందుతులపై మాదకద్రవ్యాల యాక్ట్ కింద కేసు నమోదు చేసిన స్టేషన్‌కు తరలించారు.