బరితెగించిన సైబర్ నేరగాళ్లు.. సీవీ ఆనంద్ పేరిట ఫేక్ అకౌంట్

by Shiva |
బరితెగించిన సైబర్ నేరగాళ్లు.. సీవీ ఆనంద్ పేరిట ఫేక్ అకౌంట్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ నేరగాళ్లు​ రోజు రోజుకు మితిమీరిపోతున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి క్యూఆర్​ కోడ్లు, లింకులు, ఏపీకే ఫైల్స్​ పంపిస్తూ జనం నుంచి డబ్బును దొచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. తాజాగా, కొంత మంది సైబర్ నేరగాళ్లు ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ పేరుతో సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేశారు. చాటింగ్ ద్వారా ఆయన తెలిసిన వారి నుంచి భారీగానే డబ్బు వసూలు చేసినట్లుగా సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. అంతే కాకుండా అసభ్యకరమైన రీతిలో పలువురికి మెసేజ్‌లు కూడా పెట్టినట్లుగా ప్రాథమిక విచారణలో తేలింది. ఈ మేరకు సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story