- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎనిమిదేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో/చార్మినార్: తన వికృత వాంఛలకు ఎనిమిదేళ్ల చిన్నారిని బలి చేశాడు ఓ కామాంధుడు. గమనించాల్సిన అంశం ఏమిటంటే ఆ మానవ మృగం బాధితురాలికి వరుసకు మేనమామ కావటం. వివరాలు ఇలా ఉన్నాయి. మొఘల్‌పురా ప్రాంతంలో నివాసముంటున్న ఓ మహిళకు ఎనిమిదేళ్ల కూతురు ఉంది. ఆ చిన్నారికి వరుసకు మేనమామ అయ్యే విజయ్ కుమార్ ఎలియాస్ మున్నా (23) కూడా అదే ప్రాంతంలో ఉంటున్నాడు. ఇదిలా ఉండగా ఆ చిన్నారిపై కన్నేసిన విజయ్ కుమార్ తరచూ బాలికను తన ఇంటికి తీసుకెళ్లేవాడు. ఆ తరువాత అసహజ పద్దతుల్లో ఆ చిన్నారిపై అఘాయిత్యం జరుపుతూ వస్తున్నాడు. కొన్నిసార్లు మద్యం తాగిపించి తన పశు వాంఛలు తీర్చుకునేవాడు.
విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. దాంతో ఆ బాలిక ఎవ్వరికీ విషయాన్ని చెప్పలేదు. కాగా, రెండు రోజుల క్రితం ఆ చిన్నారి మత్తులో ఉండటాన్ని గమనించిన తల్లి ఏం జరిగిందని ప్రశ్నించింది. అప్పటికీ బాధితురాలు ఏమీ చెప్పలేదు. దాంతో తల్లి గాలి ఊదమని చెప్పగా ఊదింది. అప్పుడు బాలిక మద్యం సేవించి ఉన్నట్టు వెల్లడైంది. దాంతో తల్లి గట్టిగా ప్రశ్నించటంతో విజయ్ కుమార్ తనపై చేస్తూ వస్తున్న అఘాయిత్యానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఈ మేరకు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయగా మొఘల్‌పురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.