అయ్యో పాపం.. వినాయక నిమజ్జనంలో అపశృతి.. మున్సిపల్ కార్మికుడు మృతి

by Kavitha |
అయ్యో పాపం.. వినాయక నిమజ్జనంలో అపశృతి.. మున్సిపల్ కార్మికుడు మృతి
X

దిశ, కాగజ్‌నగర్: కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం పెద్ద వాగు వద్ద మంగళవారం అర్ధరాత్రి క్రేన్ టైర్ కింద పడి లింగంపల్లి నాగేష్ (50) మృతి చెందిన ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..

నిమజ్జన సమయంలో క్రేన్ సహాయంతో వినాయక విగ్రహాన్ని తీస్తుండగా ఇద్దరు మున్సిపల్ కార్మికులు క్రేన్ టైర్ కింద పడి గాయాల పాలయ్యారు. లింగంపల్లి నాగేష్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలవగా.. ఇరిగిరాల ప్రేమ్ కుమార్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే నాగేష్‌ను పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌కు తరలించి చికిత్స అందించే సమయంలో మృతి చెందాడు. మృతుడు కాగజ్ నగర్ మున్సిపల్ కార్యాలయంలో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఘటన జరిగిన సమాచారాన్ని తెలుసుకొని సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల, ఎమ్మెల్యే హరీష్ బాబులు పరిశీలించారు. కాగా మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహించే నాగేష్ మృతితో పలువురు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed