జీవితంపై విరక్తి చెంది యువతి ఆత్మహత్య

by Disha Web Desk 15 |
జీవితంపై విరక్తి చెంది యువతి ఆత్మహత్య
X

దిశ, కనగల్లు : ఉరివేసుకొని యువతి మృతి చెందిన ఘటన మండలంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పర్వతగిరి గ్రామానికి చెందిన చెనగోని కావ్య ( 21) గౌడ్ అనే యువతి గత రెండు సంవత్సరాలుగా ఫిట్స్ వ్యాధితో బాధపడుతుంది. దాంతో తీవ్ర మనోవేదనకు గురై జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని చనిపోయింది. మృతురాలు తల్లి చెనగోని లక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు ఎస్సై బి. రామకృష్ణ గౌడ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story