గేదెనూ వదలని కామాంధుడు.. కాళ్లు కట్టేసి అత్యాచారం

by Bhoopathi Nagaiah |
గేదెనూ వదలని కామాంధుడు.. కాళ్లు కట్టేసి అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్ : రోజురోజుకు కామాంధులు పేట్రేగిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. పసికందు, ముదుసలి అని ఎరగకుండా కోరికలు తీర్చుకుంటున్నారు. ఈ దారుణాలకు మించి ఓ దుర్మార్గుడు గేదెపై అత్యాచారం చేసి పురుషజాతికే తలవంపులు తెచ్చాడు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇంటి ఎదుట కట్టేసిన గేదెపై అత్యాచారం చేశాడో కామాంధుడు. గేదె యజమాని పోలీసులకు చేసిన ఫిర్యాదుతో విషయం వెలుగుచూసింది.

వీరవాసరం మండలం తోకలపూడి గ్రామానికి చెందిన రైతు పిల్లి సీతారామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. తనకు పాలిచ్చే గేదె ఉందన్నారు. దానిని పశువుల పాకతో కట్టేసి రాత్రి ఇంట్లో పడుకున్నామని తెలిపారు. అయితే అర్ధరాత్రి ఓ వ్యక్తి పశువుల పాకలోకి ప్రవేశించి గేదె కదలకుండా ఉండేలా కాళ్లు కట్టేసి దానిపై అత్యాచారం చేశాడని తెలిపారు. గేదె అరుపులు విని తాను బయటకు రాగానే కామాంధుడు పారిపోయాడని వాపోయారు. ఈ దుశ్చర్యపై పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించగా గేదె కాళ్లకు గాయాలయ్యాని గుర్తించారు. రైతు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు పోలీసులు.



Next Story