- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వేధింపులు తాళలేక యువకుడు సూసైడ్
దిశ, దేవరకద్ర: వేధింపులు తాళలేక ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన దేవరకద్ర మండల పరిధిలో చోటుచేసుకుంది. దేవరకద్ర పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకద్ర మండలం పెద్దరాజమూర్ గ్రామానికి చెందిన సాకలి రాజా వెంకట్ 24 సంవత్సరాల యువకుడు కారు నడుపుతూ జీవనం సాగించేవాడు.ఆ యువకుడి తండ్రి హైదరాబాదులోని ఒక అపార్ట్మెంట్ లో వాచ్మెన్ గా పనిచేసేవాడు. యువకుడి తండ్రి వ్యవసాయ పనుల నిమిత్తం తన స్థానంలో కొడుకును వాచ్ మెన్ గా ఉంచి తన గ్రామానికి వచ్చాడు.
ఆ యువకుడిని అపార్ట్మెంట్ లో నివసించే భార్యాభర్తలు ఒక విషయంలో ఆ యువకుడిని వేధిస్తుండడంతో వారం రోజుల క్రితం తన సొంత గ్రామానికి వచ్చాడు. అయినా కూడా వారి వేధింపులు ఆగలేదు. దీంతో తన తల్లిదండ్రులకు విషయం తెలుస్తుంది అనే భయంతో బుధవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చేతికొచ్చిన కొడుకు మృతి చెందడంతో పెద్దరాజమూర్ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించినట్లు దేవరకద్ర ఎస్సై నాగన్న తెలిపారు.