సైబర్ మోసగాళ్ల వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య

by Disha Web Desk 15 |
సైబర్ మోసగాళ్ల వేధింపులు తాళలేక యువకుడు ఆత్మహత్య
X

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మండలం మగ్గిడి గ్రామానికి చెందిన మోతే నాగరాజు (19) అనే యువకుడి నిండు ప్రాణం సైబర్ మోసగాళ్ల వేధింపులకు బలైంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మగ్గిడికి చెందిన నాగరాజు మొబైల్ ఫోన్లో ఒక ఆన్లైన్ గేమింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడంతో గుర్తుతెలియని కొందరు సైబర్ మోసగాళ్లు ఆ యువకుడికి ఫోన్ చేసి నిషేధిత యాప్ డౌన్లోడ్ ఎందుకు చేసుకున్నావ్ అని పదేపదే ఫోన్ చేస్తూ బెదిరించారు. ఆ గుర్తుతెలియని ఆగంతకులు వారు సీబీఐ అధికారులమని. ఆ యువకుడిని బెదిరిస్తూ నిషేధిత యాప్ డౌన్లోడ్ చేసుకున్నావని చెబుతూ ఐదు లక్షల రూపాయలను ఇవ్వాలని, లేకపోతే అరెస్టు చేస్తామని బెదిరించారు. దీంతో యువకుడు తీవ్ర ఆందోళనకు లోనై ఈనెల 18వ తేదీన గడ్డి మందును సేవించాడు. అది గమనించిన కుటుంబికులు వెంటనే జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నాగరాజు పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సైబర్ యాక్టింగ్ కింద కేసు నమోదు చేసుకుని ఆర్మూర్ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.



Next Story

Most Viewed