- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ప్రమాదవశాత్తు బావిలో పడి మహిళ మృతి
by Disha Web Desk 15 |
X
దిశ, వేములవాడ : బావిలో పూడిక తీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు క్రేన్ బావిలో పడి మహిళ మృతి చెందిన సంఘటన వేములవాడ రూరల్ మండలం వట్టెంల గ్రామంలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై మారుతి తెలిపిన వివరాల ప్రకారం ఫాజుల్ నగర్ కు చెందిన దండుగుల మల్లవ్వ (70) అనే మహిళ ప్రతి రోజులాగే తన వృత్తిలో భాగంగా ఆదివారం వట్టెంల శివారులో
ఉన్న వ్యవసాయ బావి వద్ద తన కుమారుడు కొమురయ్య, కోడలు గంగమణి, మేడుదుల దేవయ్యలతో కలిసి పూడిక తీత పని చేస్తుంది. ఈ క్రమంలో క్రేన్ ఒక్కసారిగా ప్రమాద వశాత్తు బావిలో పడగా క్రేన్ పై ఉన్న మల్లవ్వ సైతం బావిలో పడింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మల్లవ్వ కుమారుడు కొమురయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
Next Story