టాటా ఏసీ.. ద్విచక్ర వాహనం ఢీ.. యువకుడికి గాయాలు..

by Sumithra |
టాటా ఏసీ.. ద్విచక్ర వాహనం ఢీ.. యువకుడికి గాయాలు..
X

దిశ, ఎల్లారెడ్డి : ఎల్లారెడ్డి మండలంలోని హాజీపూర్ తాండ గ్రామ సమీపంలో ఎదురెదురుగా వస్తున్న టాటా ఏసీ, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. టాటా ఏసీకి ద్విచక్రవాహనం తగలడంతో బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. టాటా ఏసీ డ్రైవర్ తప్పించుకొని పోవడంతో రోడ్డుపై పడి ఉన్న వ్యక్తిని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న ఎల్లారెడ్డి ఎస్సై మహేష్ సంఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎల్లారెడ్డి బైక్ ప్రమాదంలో పడి ఉన్న వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించినట్లు, ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. ప్రమాదం జరిగిన విషయాన్ని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని ఎల్లారెడ్డి ఎస్సై మహేష్ తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి వివరాలు వెల్లడిస్తామని ఎస్సై తెలిపారు.

Next Story

Most Viewed