వరుస దొంగతనాలు చేసిన వ్యక్తి అరెస్ట్

by Sridhar Babu |
వరుస దొంగతనాలు చేసిన వ్యక్తి అరెస్ట్
X

దిశ, వర్గల్ : వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. గౌరారం ఎస్సై కరుణాకర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఆగస్ట్ 9న అంబర్ పేట గ్రామంలో వరుసగా 10 ఇండ్లలో దొంగతనాలు జరిగిన విషయం తెలిసిందే. దొంగతనాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం ఉదయం శాఖారం చౌరస్తా లో తనిఖీ లు చేస్తున్నప్పుడు ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు.

అతనిని విచారణ చేయగా అతని పేరు వల్లపు రాజు (29) అని, అంబర్ పేట గ్రామానికి చెందిన వ్యక్తి అని తెల్సింది. 20 రోజుల క్రితం అంబర్ పేట గ్రామంలో తాళం వేసి ఉన్న పది ఇండ్లలో దొంగతనం చేసినట్టు తెలిపాడు. అలాగే జూలై నెలలో గజ్వేల్ పట్టణంలో రెండు ఇండ్లలో దొంగతనం చేసినట్టు నేరాన్ని అంగీకరించాడని పేర్కొన్నారు. నిందితుడి వద్ద నుండి ద్విచక్ర వాహనం, తులం బంగారం, అరవై నాలుగు తులాల వెండి వస్తువులు, రూ: 18 వేల నగదు సీజ్ చేశారు. నిందితుడిని రిమాండ్కు పంపించనున్నట్టు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed