ఘోర రోడ్డు ప్రమాదం.. 48 మంది దుర్మరణం

by Gantepaka Srikanth |
ఘోర రోడ్డు ప్రమాదం.. 48 మంది దుర్మరణం
X

దిశ, వెబ్‌డెస్క్: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు - ఇంధన ట్యాంకర్ ఢీకొని 48 మంది దుర్మరణం చెందారు. నార్త్‌ సెంట్రల్‌ నైగర్‌ స్టేట్‌లోని అగాయ్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు అధికారులతో కలిసి ఘటనా స్థలానికి వచ్చారు. ప్రయాణికులతోపాటు పశువులను తీసుకెళ్తున్న ట్రక్కును ఇంధన ట్యాంకర్‌ ఢీకొని భారీ పేలుడు సంభవించిందని.. ఈ మంటల్లో చిక్కుకొని పలువురితో పాటు 50కి పైగా జీవాలు కూడా మృత్యువాత పడ్డట్లు గుర్తించారు. అనంతరం కేసునమోదు చేసుకుని దర్యా్ప్తు ప్రారంభించారు. మృతులకు సామూహిక అంత్యక్రియలు నిర్వహించినట్లు​ తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed