15.13 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ పట్టివేత

by Sridhar Babu |
15.13 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్ పట్టివేత
X

దిశ, ఖైరతాబాద్ : ముగ్గురు డీజే ( డిస్కోజాకి) నిర్వాహకులు డ్రగ్స్‌ విక్రయిస్తుండగా వారి వద్ద 15.13 గ్రాముల ఎండీఎంఎ డ్రగ్స్‌ను శుక్రవారం ఎక్సైజ్, టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అమీర్పేట్ ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్ పటేల్ బానోత్ ఈమేరకు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. పలు పబ్బుల్లో రిమిక్స్‌ డీజే డిస్కోజాకి నిర్వహించే వ్యక్తులు డ్రగ్స్‌ అమ్మకాలు చేపడుతున్నారనే సమాచారం మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఈఎస్‌ నవీన్‌కుమార్‌ తన సిబ్బందితో కలిసి అమీర్పేట పరిధిలోని బంజరాహిల్స్‌లో దాడులు నిర్వహించారు. అఖిల్‌ డీజే నిర్వాహకుడిని పట్టుకొని

ఆతడి వద్ద ఉన్న 2.65 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను పట్టుకొని అతడిని విచారించగా అతడు ఇచ్చిన సమాచారంతో ఇబ్రహింపట్నంలోని సన్నీ ఇంట్లో సోదాలు నిర్వహించగా ఆతడి వద్ద 12.48 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ లభించాయని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు తెలిపారు. ఒక గ్రాము ఎండీఎంఏను రూ. 5000 వేలకు అమ్మకాలు జరుపుతారని పేర్కొన్నారు. ఈ డ్రగ్స్‌ను బెంగుళూర్‌కు చెందిన అలెక్స్‌ తీసుకొని వస్తాడని సమాచారం. ఇద్దరు కలిసి ఈడ్రగ్స్‌ను విక్రయిస్తున్నారు. డ్రగ్స్‌తోపాటు వీరి వద్ద 326 గ్రాముల గంజాయి కూడా లభ్యమైందని తెలిపారు. ఈ డ్రగ్స్‌ పట్టుకున్న వారిలో ఈఎస్‌ నవీన్‌కుమార్‌ తోపాటు లక్ష్మారెడ్డి, బాలరాజ్‌, యాదగిరి, మహేశ్వర్‌రావు, అరుణ్‌, కృష్ణలు ఉన్నారు. డ్రగ్స్‌ను పట్టుకున్న ఎన్‌ఫోర్స్‌ సిబ్బందిని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ విబి కమలాసన్‌రెడ్డి అభినందించారు.



Next Story