- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నాకు ఆ ఇద్దరిని పట్టిస్తే భారీ నగదు బహుమతిస్తా.. బిగ్‌బాస్ గీతూ ఎమోషనల్ పోస్ట్
దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ సీజన్-7 ఆదివారం ఫినాలే ఎపిసోడ్ ప్రసారం అయిన సంగతి తెలిసిందే. దీంతో అన్నపూర్ణ స్టూడియో వెలుపల గందరగోళం నెలకొంది. ఫ్యాన్స్ అక్కడికి భారీగా చేరుకున్నారు. ఫినాలే ముగిసిన తర్వాత టాప్ 6 గా ఉన్న శివాజీ, అమర్, ప్రశాంత్, ప్రియాంక, అర్జున్, యావర్ బయటకు వచ్చారు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ముఖ్యంగా అమర్, అశ్విని, గీతూ రాయల్ కార్లను ధ్వంసం చేశారు. అలాగే గీతూ మీద కొందరు దాడి కూడా చేసినట్లు సమాచారం. దీంతో ఆమె వెంటనే మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఆ తర్వాత ఆమె ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ‘‘ఫినాలే కావడంతో నేను తమ్ముడిని కూడా తీసుకెళ్ళాను. బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలు ముగిశాక నేను కారులో బయటకు వచ్చాను. సడన్ గా కొందరు నా కారును చుట్టుముట్టారు. వెళ్లిపోవాలని ప్రయత్నం చేసినా కుదర్లేదు. కారు అద్దాలు పగలగొట్టారు. నా చేతులు పట్టుకుని బయటకు లాగే ప్రయత్నం చేశారు. నేను సెలబ్రిటీ అయినా నా దగ్గర కార్లు లేవు. ఉన్న ఒక్క కారును నాశనం చేశారు అంటూ పోలీసులకు తన అవేదనను వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను గాలిస్తున్నారు. అయితే గీతూ ఇన్‌స్టా వేదికగా ఓ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది. ‘‘ ఒక రెడ్ టీ షర్ట్ వేసుకుని ఉన్నాడు. వాడిది బట్టతల వాడు నాకు దొరికితే కొడతాను. నాకు అద్దం పగులగొట్టిన వాడిని, ఆ రెడ్ టీ షర్ట్ వాడిని అప్పగించిన వారికి నేను కచ్చితంగా రూ. 10, 000 బహుమతిగా ఇస్తాను’’ అంటూ వీడియోను షేర్ చేసింది.