జాక్‌పాట్ కొట్టిన శివాజీ విన్నర్ కంటే ఎక్కువగా రెమ్యునరేషన్.. ఎన్ని లక్షలంటే?

by Hamsa |
జాక్‌పాట్ కొట్టిన శివాజీ విన్నర్ కంటే ఎక్కువగా రెమ్యునరేషన్.. ఎన్ని లక్షలంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా మొత్తంలో చాలా బాషల్లో బిగ్‌బాస్ రియాలిటీ ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. తెలుగులో మాత్రమే భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. ఈ షో సక్సెస్ ఫుల్‌గా సీజన్లకు సీజన్లు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సీజన్-7 ప్రసారం అవుతుంది. ఇది కూడా నేటితో ఫినాలేకు చేరుకుంది. ఇప్పటికి ఆరుగురు మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇందులో అంబటి అర్జున్, ప్రియాంక జైన్, అమర్దీప్ చౌదరి, పల్లవి ప్రశాంత్, శివాజి, ప్రిన్స్ యావర్ ఫైనలిస్టులుగా నిలిచారు. అయితే తాజా సమాచారం ప్రకారం.. ప్రశాంత్ విన్నర్ కాగా, రన్నర్‌గా అమర్ ఉన్నట్లు తెలుస్తోంది. శివాజీ, యావర్, ప్రియాంక, అర్జున్ తర్వాత స్థానాల్లో ఉన్నారు. నేడు సాయంత్రం 7 గంటలకు ఫినాలే ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఈ షోకు ఐదుగురు హీరోయిన్లు, 5 హీరోలు స్పెషల్ గెస్టులుగా వచ్చి సందడి చేయబోతున్నారు.

అయితే బిగ్‌బాస్ షో ద్వారా శివాజీ భారీగా రెమ్యునరేషన్ అందుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. శివాజి బిగ్ బాస్ ఏడో సీజన్ కోసం రోజుకు రూ. 60 వేలకు పైగానే చార్జ్ చేశాడట. అలా 15 వారాల పాటు ఉన్న శివాజి మొత్తంగా రూ. 63.75 లక్షలు రెమ్యునరేషన్‌గా తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ సీజన్‌లోని కంటెస్టెంట్లు అందరితో పోల్చుకుంటే ఇదే ఎక్కువ మొత్తం అని సమాచారం. అయితే విన్నర్ కంటే ఎక్కువగా శివాజినే ఎక్కువ మొత్తంలో తీసుకున్నట్లు తెలుస్తోంది. యావర్ 15 లక్షలు తీసుకోగా ఇంకా మిగిలిన రూ. 35 లక్షలతో పాటు రూ. 15 లక్షల గోల్డ్, రూ. 12 లక్షల కార్‌తో కలిపి మొత్తం రూ. 62 లక్షల ప్రైజ్‌మనీగా వస్తున్నాయట. అంటే విన్నర్ కంటే ఎక్కువగా శివాజీనే రెమ్యురేషన్ తీసుకున్నాడట.

Advertisement

Next Story