- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేను ఏడికి పోలే.. ఇంట్లోనే ఉన్నా.. రైతు బిడ్డ వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: రెతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ అయినప్పటి నుంచి బయట జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద కొంత మంది చేసిన విధ్వంసంపై రోజురోజుకు వివాదం పెరుగుతుంది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే.. A1 నిందితుడిగా ఉన్న పల్లవి ప్రశాంత్ మాత్రం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పరారీలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై తాజాగా ప్రశాంత్ స్పందించాడు.
ఈ మేరకు ‘అన్నా నేను ఏడికి పోలే. ఇవన్నీ తప్పుడు ప్రచారాలు. నేను ఇంటి దగ్గరే ఉన్నా. ఇంతమంది ఇన్ని ఊర్ల నుంచి వచ్చారు.. నేను ఏడికి పోలే.. నా వల్ల ఏదైనా ఇబ్బంది కలిగితే దయ చేసి నన్ను క్షమించండి. నేను ఏ తప్పు చేయలేదు. ఎవరెవరో చేసినవి నా మీద వేస్తుర్రు. కావాలని నెగిటివ్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు. నేను ఏడికీ పోను. అయినా ఆ న్యూస్ చూసి నేనే షాక్ అయ్యా.. నా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందంటే నేను వచ్చినప్పటి నుంచి ఫోనే పట్టుకోలే. నేను ఇంకో పాత ఫోనులో వీడియోలు తీసుకున్నా తప్ప.. ఆ ఫోన్ ముట్టుకోలే. దయచేసి మీరే ఆలోచించండి. నేను ఇంటికాడే ఉన్నాను. ఏడికి పోలే. టెన్షన్ పడకుర్రి. టెన్షన్ పెట్టాలని చాలా మంది చూస్తున్నారు కానీ, మీరు ఎవరు టెన్షన్ పడకండి. నేను ఇంటి దగ్గరే ఉన్నా. నన్ను మీ ఇంట్లో మనిషిగా అనుకుని ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి నేను రుణపడి ఉంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు వస్తున్న వార్తలకు చెక్ పెట్టినట్లు అయింది.