- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈ సీజన్ విన్నర్ నేనే.. ప్రశాంత్ వెనుక ఉన్న శక్తి నేనే: శివాజీ
దిశ,వెబ్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ శివాజీ అవుతారనే అందరూ అనుకున్నారు కానీ బిగ్ బాస్ శివాజీకి బిగ్ షాక్ ఇచ్చాడు. ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్‌లో గెస్ట్‌లుగా వచ్చిన వాళ్లంతా.. శివాజీకే పట్టం కట్టడంతో ఆ తరువాత నుంచి అతని ఆట గాడితప్పింది. ముఖ్యంగా అమర్ దీప్‌ని చులకన చేసి మాట్లాడటం అతనికి బాగా నెగిటివ్ అయ్యింది. అయితే బిగ్ బాస్ అనంతరం జరిగే బిగ్ బాస్ బజ్‌లో శివాజీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నామినేషన్స్‌లో మాదిరిగా యాంకర్ గీతుకి, శివాజీకి మధ్య సీరియస్ డిస్కషన్ నడిచింది. టాప్ 3 వరకూ వస్తానని మీరు ఊహించారా? అని గీతు ప్రశ్న వేయడంతో.. నేను ‘టాప్ 3 ఏంటి? ఈ సీజన్ విన్నర్ నేనే’ అంటూ పొగరుగా సమాధానం చెప్పారు.
‘మీవల్లే ప్రశాంత్, యావర్ ఇంత దూరం వచ్చారని మీరు అనుకుంటున్నారా?’ అని గీతూ అడిగింది. దాంతో శివాజీ.. వాళ్ల వెనుకు ఓ శక్తి ఉందని అందరికీ తెలియజేశాను’ అని శివాజీ అన్నారు. ‘‘మీరు.. ప్రశాంత్, యావర్ మైండ్‌లో లేని ఆలోచల్ని క్రియేట్ చేశారు’’ అని అనడంతో.. ‘నీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి నేను రాలేదు’ అని సీరియస్ అయిపోయారు శివాజీ. సరే ఇంతకీ బిగ్ బాస్ హౌస్‌కి ఎందుకు వచ్చారు? అని గీతు అడగడంతో.. ‘శివాజీ అనేవాడు వచ్చాడంటే.. బిగ్ బాస్ తెలుగు సీజన్‌లో ఎప్పటికీ గుర్తిండిపోవాలని వచ్చాను.. దటీజ్ మై మార్క్’ అంటూ తన గురించి తాను చాలా గొప్పగానే చెప్పుకున్నాడు శివాజీ. ఇది చూసిన నెటిజెన్స్ కొట్టిన సెల్ఫ్ డబ్బా చాలు.. ఆపవయ్యా అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.