- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిగ్‌బాస్-7: విన్నర్ పల్లవి ప్రశాంత్ తమ్ముడు అరెస్ట్..
దిశ, వెబ్‌డెస్క్: బిగ్‌బాస్ సీజన్-7 తెలుగు షో వివాదం రోజురోజుకు పెరుగుతోంది. బిగ్ బాస్ విన్నర్‌గా పల్లవి ప్రశాంత్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. విజేతగా టైటిల్ అందుకున్న తర్వాత హైదారాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద రైతుబిడ్డ ప్రశాంత్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపులోకి తెచ్చి ప్రశాంత్‌ని మళ్లీ అటు చుట్టుపక్కలకు తీసుకురావొద్దని హెచ్చరించారు. అయితే ఆ తర్వాత ప్రశాంత్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించి అటుగా వస్తున్న వాహనాలు ధ్వంసం చేశారు.
దీని కారణంగా జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియో వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు రైతు బిడ్డపై పలు కేసులు నమోదు చేశారు. ఈ కేసులో పల్లవి ప్రశాంత్‌ను A1 నిందితుడిగా చేర్చిన పోలీసులు అతని తమ్ముడు మనోహర్‌ను A2గా, మరో స్నేహితుడిని A3గా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా, పల్లవి ప్రశాంత్ తమ్ముడు మనోహర్‌తో పాటు అతడి స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదేశాలకు ఉలంఘించిన కేసులో వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఇదిలా ఉంటే A1 నిందితుడు పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు సమాచారం. అతడిని పట్టుకునేందుకు పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.