బిగ్‌బాస్-7: విన్నర్ పల్లవి ప్రశాంత్ రాజకీయ ఎంట్రీపై.. తండ్రి ఆసక్తికర కామెంట్స్ వైరల్

by Hamsa |
బిగ్‌బాస్-7: విన్నర్ పల్లవి ప్రశాంత్ రాజకీయ ఎంట్రీపై.. తండ్రి ఆసక్తికర  కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-7 ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందింది. ఆడియన్స్ లో ఆసక్తి ఏర్పాటు చేయడానికి బిగ్ బాస్ ఉల్టా పల్టా అని అనేక జిమ్మిక్స్ చేశారు. దీంతో జనాల్లో ఆసక్తి మరింత పెరిగింది. కాగా, ఇందులో 19 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా వారానికి ఒక్కరి చొప్పున 13 మంది ఎలిమినేట్ అవ్వగా.. ఫినాలేకు ఆరుగురు ఫైనలిస్ట్ గా నిలిచారు. చివరికి కామన్ మ్యాన్, రైతు బిడ్డగా ఎంట్రీ ఇచ్చి సెలబ్రిటీలనే ఓడించి కప్పు గెలుచుకున్నాడు పల్లవి ప్రశాంత్. మొదటి నుంచి తనదైన ఆట తీరుతో ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశాడు. రైతు బిడ్డ పవర్ ఏంటో అందరికీ అర్థం అయ్యేలా చేశాడు. మొత్తానికి బిగ్‌బాస్-7 విన్నర్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. అంతేకాకుండా ఎంతో మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు. అలాగే విన్నింగ్ ఏమౌంట్ మొత్తం రైతులకు ఇస్తానని బిగ్‌బాస్ స్జేజ్‌పై ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నాడు.

ఇదిలా ఉంటే.. తాజాగా, ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పల్లవి ప్రశాంత్ తండ్రి ఆసక్తికర కామెంట్స్ చేశాడు. పల్లవి ప్రశాంత్ కి ఉన్న ఫాలోయింగ్ ని చూస్తూ ఉంటే అతను రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది అని ఆయన అభిమానులు అంటున్నారు, దీనికి మీరు ఏమంటారు? అని యాంకర్ అడగగా.. దానికి ఆయన సమాధానం చెప్తూ ‘‘నా కొడుకు ఇంత దూరం రావడం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తుంది. వాడికి సినిమాలు అంటే ప్రాణం, సినీ నటుడిగా మంచి భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటున్నాను. కానీ రాజకీయాల్లోకి రావాలని నాకు లేదు’’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story