బిగ్‌బాస్-7: శోభాశెట్టి బాయ్‌ఫ్రెండ్.. డాక్టర్ బాబు తమ్ముడా.. ట్విస్ట్ అదిరిందిగా?

by Hamsa |
బిగ్‌బాస్-7: శోభాశెట్టి బాయ్‌ఫ్రెండ్.. డాక్టర్ బాబు తమ్ముడా.. ట్విస్ట్ అదిరిందిగా?
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర నటి శోభాశెట్టికి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ అమ్మడు ‘కార్తీక దీపం’ సీరియల్‌లో మోనితగా నటించి ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. అందులో విలన్ క్యారెక్టర్‌లో తను లీనమై నటించింది. ఆ తర్వాత పలు షోస్‌లో శోభా సందడి చేసింది. ఇక ఇటీవల స్టార్ట్ అయిన బిగ్‌బాస్-7 రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. హౌస్‌లో మొదటి నుంచి తనదైన ఆటిట్యూడ్‌తో ముందుకు కొనసాగుతోంది. అలాగే బిగ్‌బాస్‌లో రియల్, కంటెస్టెంట్ అర్హతతో పాటు, కెప్టెన్‌గా కూడా వ్యవహరించింది. కొన్నిసార్లు టేస్టీ తేజతో క్లోజ్‌గా ఉంటూ.. తనకు కాబోయే వాడు ఈ షోను చూసి ఏమనుకుంటున్నాడో అని చాలా ఎమోషనల్ అయింది. దీంతో ఆమె లవర్ ఎవరిని నెట్టింట చర్చలు మొదలయ్యాయి. తాజాగా, 11వ వారంలో నాగార్జుల దీపావళి సందర్భంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు.

ఇందులో భాగంగా శోభా శెట్టి బాయ్‌ఫ్రెండ్‌ను పిలిచాడు. అతను కూడా ఓ నటుడే. కార్తీకదీపం సీరియల్‌గా డాక్టర్ బాబు తమ్ముడుగా నటించిన ఆదిత్య అందరికీ గుర్తే ఉన్నాడు. అతని అసలు పేరు యశ్వంత్ అని తెలుస్తోంది. ఇక వీరిద్దరూ మూడేళ్లుగా తమ ప్రేమను ఎవరికీ తెలియకుండా మెయింటైన్ చేస్తున్నారట. శోభా, యశ్వంత్‌లకు ఎంగేజ్‌మెంట్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ అమ్మడు బిగ్‌బాస్ నుంచి వచ్చాక పెళ్లి చేసుకోబోతున్నారట. ఇక శోభా ప్రియుడిని చాలా రోజుల తర్వాత స్టేజ్‌పై చూసి చాలా ఎమోషనల్‌ అయిపోయింది. దీంతో నాగార్జున ఎందుకు ఏడుస్తున్నావు, ఈ ఏడుపు బాయ్‌ఫ్రెండ్‌ని చూసా, లేక తండ్రిని చూసా అని అంటాడు. అప్పుడు ఆమె తండ్రిని చూసే అని సమాధానమిస్తుంది. ఆ తర్వాత శోభా, యశ్వంత్ ఇద్దరు మరోసారి తమ ప్రేమను వ్యక్త పరుచుకుంటారు. ఆ తర్వాత అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే శోభా లవర్ నటుడే అని తెలియడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

Advertisement

Next Story