బిగ్‌బాస్-7: ద్వారా పల్లవి ప్రశాంత్ ఎంత సంపాదించాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by Hamsa |
బిగ్‌బాస్-7: ద్వారా పల్లవి ప్రశాంత్ ఎంత సంపాదించాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, వెబ్‌డెస్క్: పల్లవి ప్రశాంత్.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతున్న పేరు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదండోయ్ ఇక ఇండియా వేదికగా కూడా అందరూ ఇతని గురించి చర్చించుకుంటున్నారు. ఎందుకంటే.. తెలుగు రియాలిటీ షోలో కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చి 18 మంది సెలబ్రిటీలను ఓడించి మరీ కప్పు గెలిచి చరిత్ర సృష్టించాడు. ఓ కామన్ రియాలిటీ షోలో విన్నర్‌గా నిలవడం ఇదే మొదటి సారి. బిగ్ బాస్ హౌస్ లో ఎంతో మంది ఎదురు దెబ్బ కొట్టాలని ప్రయత్నించిన.. అతను మాత్రం తన ఆట తీరును.. తన వ్యక్తిత్వాన్ని మార్చుకోకుండా మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఒకే విధంగా ఉంటూ ప్రేక్షకులను ఫిదా చేశాడు.

అందరూ ఊహించినట్లుగానే విన్నర్ అయ్యాడు. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా నిలిచి ఎన్ని బెనిఫిట్స్ పొందాడన్నదే హాట్ టాపిక్‌గా మారింది. 15 లక్షలు టాప్ ఫోర్ గా ఉన్న యావర్ తీసుకోవడంతో ఇక అతనికి 50 లక్షల ప్రైజ్ మనీ లో కేవలం 35 లక్షల మాత్రమే పల్లవి ప్రశాంత్‌కి వచ్చాయి. అంతేకాకుండా 15 లక్షల విలువైన ఒక డైమండ్ నెక్లెస్ సొంతం చేసుకున్నాడు. 15 లక్షల విలువ చేసే కారును కూడా ప్రైజ్ మనీ గా అందుకున్నాడు. ఇక అతని రెమ్యునరేషన్ కూడా లక్షల్లోనే ఉండనుందట. ఓవరాల్‌గా బిగ్ బాస్ ద్వారా పల్లవి ప్రశాంత్ కోటి రూపాయలు విలువైన సొత్తును సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story