అయోధ్య ప్రాణప్రతిష్ఠకు నేను వెళ్తా- మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ

by Shamantha N |
అయోధ్య ప్రాణప్రతిష్ఠకు నేను వెళ్తా- మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ
X

దిశ నేషనల్ బ్యూరో: వచ్చే లోకసభ ఎన్నికల కోసం పూర్తి శక్తితో పోరాడతానన్నారు మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడ. ఎన్నికల్లో పోటీ చేస్తానా లేదా అనే ప్రశ్నే లేదన్నారు. ఈసారి ఎన్నికలు ముఖ్యమైనవి అన్నారు. ఈనెల 22న జరిగే అయోధ్య ప్రాణప్రతిష్ఠ కోసం తాను వెళ్లనున్నట్లు తెలిపారు. కుటుంబసమేతంగా అయోధ్యలో పర్యటిస్తానన్నారు. తనని ఆహ్వానించినట్లుత.. తన కుటుంబం కోసం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరోవైపు అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ ఏర్పాట్లను పరిశీలించారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. అయోధ్యలో జరుగుతున్న ఏర్పాట్లపైన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రధాని మోడీ పూజలు నిర్వహిస్తుండగా.. పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంయలో పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed