స్పెషల్ టాలెంట్ బయటపెట్టిన డిప్యూటీ సీఎం.. అందరూ ఫిదా (వీడియో)

by GSrikanth |
స్పెషల్ టాలెంట్ బయటపెట్టిన డిప్యూటీ సీఎం.. అందరూ ఫిదా (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవరం వేళ కర్ణాటక డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తనలోని ప్రత్యేక మైన టాలెంట్‌ను బయటపెట్టారు. అద్భుతంగా పాట పాడి.. అందరి చేత పాడించి ఆకట్టుకున్నారు. ఇటీవల మహారాష్ట్రలోని నాగపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఫడ్నవీస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘జాగో తో ఏక్ బార్ హిందూ జాగో తో’ అని పాట పాడారు. అంతేకాదు.. అందరిచేత పాడించారు. దీంతో డిప్యూటీ సీఎం పాటకు అందరూ ఫిదా అయి చప్పట్లతో అభినందించారు. కాగా, అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం ఈ నెల 22న జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మహా ఘట్టానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు.


Advertisement

Next Story