అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం.. భద్రత కోరుతున్న స్థానిక ముస్లింలు

by Shamantha N |
అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం.. భద్రత కోరుతున్న స్థానిక ముస్లింలు
X

దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠకు సర్వం సిద్ధమవుతోంది. ఇలాంటి టైంలో అక్కడి ముస్లింలు భయాందోళనకు గురవుతున్నారు. మతపరమైన సంఘటనలకు భయపడి పోలీసు భద్రతను అభ్యర్థిస్తున్నారు స్థానిక ముస్లింలు. స్థానికంగా ఉన్న రామభక్తుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేదని.. కానీ ప్రతిష్ఠ కోసం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తులు అయోధ్యకు వస్తారని.. అందుకే భద్రత కావాలని కోరారు.

ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎలా ఆలోచిస్తున్నారో.. ఏం చేయాలనుకుంటున్నారో తమకు తెలిదని స్థానికడు అబ్దుల్ వహీద్ ఖురేషీ తెలిపారు. అయోధ్యలోని రామజన్మభూమి పీఎస్ పరిధిలోని దురాహి కువాన్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగవని అడ్మినిస్ట్రేషన్ హామీ ఇచ్చిందన్నారు. కానీ అయోధ్యలో 1990, 1992లో మతపరమైన ఘటనలు తమ కుటుంబం దగ్గర్నుంచి చూసిందన్నారు.

1992లో బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత అయోధ్యలో హింసాత్మక ఘటనలు జరిగాయి. దీంతో కట్టుదిట్టమైన భద్రత కోరుతూ అధికారులకు వినతిపత్రం అందజేశారు స్థానిక ముస్లింలు.తీన్ వాలీ మసీదు, గోల్ చౌరహా సయ్యద్‌బారా, బేగంపురా, దురాహి కువాన్, మొఘల్‌పురా, టెర్హిబజార్ ప్రాంతాల్లో భద్రత కల్పించాలని ఐజీపీకి వినతిపత్రం అందజేశారు. అయోధ్య ఆలయ పరిసరాల్లో 4 కిలోమీటర్ల పరిధిలో 5వేల మంది ముస్లింలు ఉన్నారు. అయోధ్య జిల్లాలో దాదాపు 14.8 శాతం ముస్లింలు ఉన్నారు. కొందరు స్థానిక ముస్లింలు తమ పిల్లలు, మహిళలను లక్నో, బారాబంకి జిల్లాలోని బంధువుల ఇళ్లకు పంపారన్నారు అయోధ్య సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు సబ్ కమిటీ అధ్యక్షుడు ఆజం ఖాద్రీ. భద్రత కల్పిస్తామని చెప్పినప్పటికీ.. గతంలోని మతపరమైన ఘటనల భయం ఇంకా పోలేదన్నారు.

Advertisement

Next Story

Most Viewed