- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అయోధ్యలో పాత రాముడి విగ్రహం ఏం చేయనున్నారో తెలుసా?
దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య బాల రాముడి ప్రాణప్రతిష్టకు మరి కొన్ని గటలే మిగిలి ఉంది. సరిగ్గా మధ్యాహ్నం 12:29 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ ఆలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం 1:15 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలోని దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారు. దీంతో ఉత్తరప్రదేశ్ పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.
ఈ క్రమంలో అయోధ్యలో ఇన్నాళ్లూ పాత మందిరంలో ఉన్న పాత బాల రాముడి విగ్రహాన్ని ఏం చేస్తారని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. దీనిపై తీర్థక్షేత్ర ట్రస్ట్ స్పందించింది. సోమవారం గర్భగుడిలో కొత్తగా ప్రతిష్టించనున్న బాలరాముడి విగ్రహానికి ఎదురుగా పాత విగ్రహాన్ని ప్రతిష్టించేలా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. పాత విగ్రహం దాదాపు 6 అంగుళాల ఎత్తు ఉందని.. అది 30 అడుగుల దూరం ఉన్నవారికి కూడా కనిపించదు అని అందుకే కొత్త విగ్రహం అవసరమైందని తెలిపారు. కాగా, దాదాపు 1800 కోట్లతో రామమందిరాన్ని నిర్మించారు.