పరీక్షల్లేవ్.. 9,11 తరగతి విద్యార్థులు డైరెక్ట్ పాస్

by Shamantha N |   ( Updated:2021-04-07 11:11:13.0  )
students
X

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రరూపం దాలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కట్టడికి చర్యలకు ఉపక్రమించాయి. దేశంలో పెరుగుతున్న కేసుల్లో అధిక భాగం మహారాష్ట్ర రాజధాని ముంబై కేంద్రంగా వెలుగు చూస్తున్నాయి. దీంతో పుణెతో పాటు ముంబైలో నైట్ కర్ఫ్యూలు కొనసాగుతున్నాయి. దానికి తోడు రాష్ట్రవ్యాప్తంగా వీకెండ్ శని, ఆదివారాల్లో లాక్‌డౌన్ విధిస్తూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల పాఠశాలకు వెళితే కరోనా అటాక్ అయ్యే చాన్స్ ఉందని తల్లిదండ్రులు భయపడుతున్నారు.

మరోవైపు లాక్‌డౌన్ వలన తమ పిల్లల భవిష్యత్ ఎంటనీ మనోవేదనకు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మహారాష్ట్ర సర్కార్ తొమ్మిది, పదకొండవ తరగతుల విద్యార్థులను పరీక్షలు లేకుండా పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రం కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి వర్ష గైక్వాడ్ బుధవారం వెల్లడించారు. కాగా, ఇదివరకే 1నుంచి 8వ తరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండా పాస్ చేసినట్లు మహారాష్ట్ర విద్యాశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story