- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కొవిడ్ నుంచి కోలుకున్న 94 ఏళ్ల వృద్ధుడు
by sudharani |

X
కొవిడ్ మహమ్మారి మరణాల రేటు తక్కువే కానీ.. పిల్లలు, వృద్ధుల విషయంలో అంత నమ్మకం లేదు. కానీ ప్రపంచంలోని చాలా దేశాల్లో వృద్ధులు ఈ మహమ్మారితో పోరాడి గెలిచారు. మనం దేశంలోనూ ఓ 94 ఏళ్ల వృద్ధుడు కోలుకుని, కరోనాను వయసుతో సంబంధం లేకుండా జయించవచ్చని నిరూపించాడు. ఈయన కోలుకోవడంతో దేశంలో వృద్ధ కరోనా బాధితుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ నగర్‌కు చెందిన ఈ వృద్ధ పేషెంటు కోలుకోవడం తమను మరింత మోటివేట్ చేసిందంటూ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ సుహాస్ లాలినకేరే ట్వీట్ చేశారు. ఓవైపు కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతున్న క్రమంలో ఇలాంటి విషయాలు నిజంగానే మనలో ఆశావహ దృక్పథాన్ని పెంపొదిస్తాయి.
Next Story