92 ఏళ్ల వయసులో కొవిడ్‌ను జయించిన యోధుడు

by Shyam |
92 ఏళ్ల వయసులో కొవిడ్‌ను జయించిన యోధుడు
X

దిశ, ఫీచర్స్ : కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని పట్టి పీడిస్తోంది. ఈ క్రమంలో ఆక్సిజన్ అందక పలువురు చనిపోతున్నారు. అయితే ఆత్మస్థైర్యంతో జాగ్రత్తలు తీసుకుంటూ కరోనాను జయిస్తున్నవారూ ఎక్కువగానే ఉంటున్నారు. వయసు పైబడితేనేం.. అది అసలు సమస్యే కాదని నిరూపిస్తూ, కొవిడ్‌ను జయించి ఇతరుల్లో స్ఫూర్తి నింపుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌కు చెందిన 92 ఏళ్ల తులసీరామ్ సేఠియా కూడా ఆ కోవకు చెందిన వ్యక్తే.

తులసీరామ్‌కు ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, అందరిలా తాను అధైర్యపడలేదు. అయితే ఈ వయసులో కొవిడ్ సోకితే జయించలేరని, ఆయన కుటుంబీకులు తెగ భయపడ్డారు. ఆస్పత్రికి తీసుకెళ్తామని ఆయన్ను కోరారు. కానీ అందుకు తులసీరామ్ ఒప్పుకోలేదు. హోం ఐసొలేషన్‌లో ఉండి వైద్యుల సూచనల మేరకు ట్యాబ్లెట్స్ తీసుకుంటూ, ఇతర జాగ్రత్తలు పాటిస్తానని చెప్పాడు. దీంతొ కుటుంబీకులు కావాల్సిన ఏర్పాట్లు చేయగా.. తనకు ఎంతో ఇష్టమైన మ్యూజిక్ వింటూ, డ్యాన్స్ చేస్తూ హోమ్ ఐసోలేషన్‌ను హ్యాపీగా గడిపేశాడు. ఇక తాజాగా తులసీరామ్‌కు కొవిడ్ టెస్ట్ చేయగా నెగెటివ్ రావడంతో కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయన స్టోరీని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతోంది.

తులసీరామ్ విషయానికొస్తే.. తాను వందేళ్లు బతుకుతానని, ధైర్యమే ఆయుధంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎవరైనా కరోనాను ఓడించొచ్చని చెప్తున్నాడు. కాగా తులసీరామ్‌ను చూసి ప్రతీ ఒక్కరు నేర్చుకోవాల్సిన ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే కొవిడ్‌పై ఈజీగా విజయం సాధించగలమని వెల్లడిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed