- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
పల్టీ కొట్టిన ట్రాక్టర్.. బాలుడి ప్రాణం తీసుకుంది
by Sumithra |

X
దిశ, తుంగతుర్తి: వరి ధాన్యాన్ని తరలిస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడ్డ ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం కన్నారెడ్డిగుట్ట తండాలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇదే తండాకు చెందిన లకావత్ దేవరాజు ఓ ట్రాక్టర్‌లో ధాన్యం లోడును ఎక్కించాడు. అనంతరం కొనుగోళు కేంద్రానికి తీసుకెళ్దామని.. అభిరామ్ (9) అనే బాలుడిని కూడా ట్రాక్టర్ ఎక్కించుకున్నాడు. ఇదే క్రమంలో పంట పొలల్లోనే అతివేగంగా డ్రైవ్ చేయడంతో ట్రాక్టర్ పల్టీ కొట్టగా.. అభిరామ్ కిందపడిపోయాడు. వెనక టైర్లు తల మీదుగా దూసుకెళ్లడంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనతో కన్నారెడ్డిగుట్ట తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Next Story