- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
85శాతం కేసులు 8 రాష్ట్రాల్లోనే: కేంద్రం
న్యూఢిల్లీ: దేశంలోని మొత్తం కేసుల్లో 85.5 శాతం కేవలం ఎనిమిది రాష్ట్రాల నుంచే రిపోర్ట్ అయ్యాయని, 87 శాతం మరణాలూ ఈ రాష్ట్రాల్లోనే చోటుచేసుకున్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 24 గంటల్లో 18,552 కేసులు నమోదయ్యాయని, ఫలితంగా మొత్తం కేసులు ఐదు లక్షలను దాటాయని శనివారం తెలిపింది. ప్రస్తుతం దేశంలో కొవిడ్ 19 పరిస్థితులు, ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ఆరోగ్య మౌలిక వసతులను పెంచుకోవడానికి చేపడుతున్న చర్యలను మంత్రుల బృందానికి వివరించినట్టు ఈ శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.
దేశంలోని మొత్తం కేసుల్లో 85.5శాతం కేసులు, 87శాతం మరణాలు ఎనిమిది రాష్ట్రాలు మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లలోనే నమోదయ్యాయని వివరించింది. 24 గంటల్లో దేశంలో 2,20,479టెస్టులు నిర్వహించారని, దీంతో ఇప్పటి వరకు మొత్తం 79.96లక్షల టెస్టులు పూర్తయ్యాయని పేర్కొంది. ప్రస్తుతం దేశంలో 1,026 డయాగ్నస్టిక్ ల్యాబ్‌లున్నాయని, ఇందులో 741 ప్రభుత్వానివైతే, 285 ప్రైవేట్ ల్యాబ్‌లని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ మంత్రుల బృందానికి వివరించారని వివరించింది. కరోనాపై పోరులో రాష్ట్రానికి దన్నుగా ఉండేందుకు ఆరోగ్య నిపుణులు, ఎపిడమాలజిస్టులు, సీనియర్ జాయింట్ సెక్రెటరీ స్థాయి అధికారులున్న 15 కేంద్ర ప్రభుత్వ బృందాలు రంగంలోకి దిగాయని, మరో మూడు కేంద్ర బృందాలు గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణలో పర్యటిస్తున్నాయని తెలిపింది.