- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓయూలో 7వ నిజాం వర్ధంతి..
దిశ, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ వ్యవస్థాపకులు హైదరాబాద్ సంస్థాన 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ 53వ వర్ధంతిని సోమవారం ఓయూలో దళిత మైనారిటీ స్టూడెంట్ అసోసియేషన్ (డీఎమ్ఎస్ఏ) ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజ్ ముందు నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్‌కు ఘనంగా నివాళ్లర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్లు డాక్టర్ గాలి వినోద్ కుమార్, అన్సారి పాల్గొని మాట్లాడుతూ… నిజాం గొప్ప సెక్యులర్ రాజు అని, నిజాం రాజు లేకుంటే కొన్ని లక్షలాది మంది పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేవారు కాదన్నారు. డీఎంఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు దూడపాక నరేష్ మాట్లాడుతూ… తెలంగాణలోని అన్ని యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లను నియామకం చేయాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ భూములను కాపాడాలని, ఉస్మానియా భూములకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిజాం రాజు యూనివర్సిటీ స్థాపించిన తరువాత ప్రతిఏటా విద్యకు 11% బడ్జెట్ కేటాయించేవాడని, ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఉన్నత విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని విమర్శించారు. యూనివర్సిటీ స్థాపించి వందేండ్లయినా కనీసం యూనివర్సిటీ భవనాల్లో వ్యవస్థాపకుని చిత్రపటం లేదని, వెంటనే ప్రతి డిపార్టుమెంటులో యూనివర్సిటీ వ్యవస్థాపకుని చిత్రపటం ఉంచాలన్నారు. యూనివర్సిటీ ఒరిజినల్ లోగో పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.