700 కి.మీ.ల మెరుపు.. సరికొత్త రికార్డు

by Shyam |
700 కి.మీ.ల మెరుపు.. సరికొత్త రికార్డు
X

వర్షం కురుస్తున్నపుడు ఉరుములు, మెరుపులు కనిపించడం సహజమే. అయితే ఆ కనిపించే మెరుపుల్లో అతిపెద్ద మెరుపుగా గతేడాది బ్రెజిల్‌లో కనిపించిన ఓ మెరుపు రికార్డు సృష్టించింది. బ్రెజిల్‌లో ఏకంగా 700 కి.మీ.ల పాటు విస్తరించిన ఈ మెరుపు.. అత్యంత దూరం విస్తరించిన మెరుపుగా రికార్డుకెక్కినట్లు ఐక్యరాజ్యసమితి వాతావరణ సంస్థ తెలిపింది. ప్రపంచ వాతావరణ సంస్థ కమిటీ నిపుణులు చెప్పినదాని ప్రకారం, ఎక్కువదూరం విస్తరించిన మెరుపు, ఎక్కువ సమయం కనిపించిన మెరుపులుగా వరుసగా బ్రెజిల్, అర్జెంటీనాల్లో కనిపించిన మెరుపులు రికార్డు సృష్టించినట్లు తెలిసింది.

గతంలో పోల్చిన మెరుపులతో పోల్చితే, 2019లో రికార్డయిన మెగా ఫ్లాషెస్ రెట్టింపుగా ఉన్నాయని వాతావరణ సంస్థ తెలిపింది. మార్చి 4, 2019న అర్జెంటీనాలో కనిపించిన మెరుపు 16.73 సెకన్ల పాటు కనిపించి సరికొత్త రికార్డు సృష్టించింది. అలాగే అక్టోబర్ 31న బ్రెజిల్‌లో ఒక ఫ్లాష్ 700 కి.మీ కంటే ఎక్కువ దూరం కనిపించింది. 2007లో ఒక్లహామాలో ఈ రికార్డు 321 కి.మీ.లుగా రికార్డయింది. ఇక సమయం విషయంలో 2012లో 7.74 సెకన్ల పాటు ఫ్రాన్స్‌లో ఒక మెరుపు కనిపించింది. ఈ మెరుపులను అమెరికన్ జియోఫిజికల్ యూనియన్ రికార్డు చేస్తుంది. జూన్ 28న అంతర్జాతీయ లైటెనింగ్ సేఫ్టీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రికార్డు విషయాలను వాతావరణ సంస్థ కమిటీ ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed