- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏడేళ్లకే.. మైక్రోసాఫ్ట్ కోడ్ ఎగ్జామ్ పాస్
దిశ, వెబ్‌డెస్క్: చిన్నారులు కూడా పెద్దవారికి దీటుగా ఎన్నో విజయాలను సాధిస్తూ అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభను చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒడిశా బాలంగీర్‌కు చెందిన ఏడేళ్ల బాలుడు మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ అసోసియేట్ పరీక్షను క్లియర్ చేసి ఔరా అనిపించాడు.
టెక్ ఎరాలో ప్రతి బుడ్డోడు కూడా సెల్‌ఫోన్, కంప్యూటర్, ల్యాప్‌టాప్‌తో ఆటాడుకుంటున్నారు. చిన్న వయసులోనే కోడింగ్ పాఠాలు కూడా నేర్చుకుంటున్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యావ్యవస్థలోనూ ఆరో తరగతి నుంచే కోడింగ్ నేర్చుకోవడాన్ని తప్పనిసరి చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే బీటెక్, ఎంసీఏ చదివిన విద్యార్థులకే కోడింగ్ సరిగ్గా బుర్రకు ఎక్కదని, ప్రోగ్రామ్స్ రాయడంలో తడబడతారనే కామెంట్స్ వినిపిస్తుంటాయి. అలాంటిది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎగ్జామ్‌ను ఏడేళ్ల వెంకట్ రామన్ పట్నాయక్ ఈజీగా క్లియర్ చేశాడు. జావా, జావా స్క్రిప్ట్, పైథాన్, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ ఫండమెంటల్స్‌లో మొత్తం 160 క్లాసులకు హాజరై, ఆయా కోర్సుల్లో పట్టు సాధించమే కాకుండా, ఆ కోర్సులు చేసిన వారికి ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ నిర్వహించే ఎంటీఏ (మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ అసోసియేట్) ఎగ్జామ్‌కు హాజరై ఉత్తీర్ణత సాధించాడు. ఆ సర్టిఫికేషన్‌ను పొంది చరిత్ర సృష్టించాడు.