నెలసరి నిరూపించాలని.. అమానుషం

by Shamantha N |
నెలసరి నిరూపించాలని.. అమానుషం
X

గుజరాత్‌లోని ఓ కళాశాల యాజమాన్యం అమానుష ఆచారాలను ఇంకా అమలు చేస్తూ విద్యార్థినుల పట్ల అనుచితంగా ప్రవర్తించింది. నెలసరితో లేరని నిరూపించాలని దాదాపు 68 మంది విద్యార్థులను రెస్ట్‌రూమ్‌లోకి పంపించి లోదుస్తులు తొలగించాల్సిందిగా ఆదేశించింది. తాము ప్రతిరోజూ ఈ వేధింపులు ఎదుర్కొంటున్నామని, ఇలా లోదుస్తులు తొలగించి నెలసరి లేదని నిరూపించుకోవడం ప్రతినెలా జరుగుతున్న తంతు అని ఓ విద్యార్థిని వెల్లడించడం గమనార్హం.

స్వామి నారాయణ ఆలయ భక్తులు కొందరు కలిసి కచ్ జిల్లాలోని భుజ్ పట్టణంలో శ్రీ సహజానంద గర్ల్స్ ఇన్‌స్టిట్యూట్‌ను నిర్వహిస్తున్నారు. నెలసరితో ఉన్నవారు ఇతర విద్యార్థులకు దూరంగా ఉండాలని, వంటగది, సమీపంలోని ఆలయంలోకి ప్రవేశించరాదన్న నిబంధనను కాలేజీలో కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ నిబంధనను అతిక్రమించారని సమాచారం అందుకున్న ప్రిన్సిపల్ విద్యార్థినులను లైన్‌లో నిలుచోబెట్టి ఒక్కొక్కరిని రెస్ట్ రూమ్‌లోకి పంపించారు. లోదుస్తులు తొలగించి నెలసరితో ఉన్నారో లేదోనని పరీక్షించేందుకు ఉపక్రమించారు.

Advertisement

Next Story

Most Viewed