నిజామాబాద్‌లో ఆరు కరోనా కేసులు

by vinod kumar |

దిశ, నిజామాబాద్: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శనివారం కొత్తగా 6 కరోనా కేసులు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లాలోనూ 3కరోనా పాజిటివ్ రిపోర్టులు వచ్చినట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చంద్రశేఖర్ వెల్లడించారు. జిల్లాలో ప్రైమరీ కాంటాక్ట్స్ 26 మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చిందన్నారు. వీరిలో కామారెడ్డి పట్టణం రాంమందిరం ఏరియాకు చెందిన ఇద్దరు ఉండగా, గాంధారికి చెందిన ఒకరు ఉన్నారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. ఈ ముగ్గురికి సంబంధించి ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ను గుర్తించి క్వారంటైన్‌కు తరలించేందుకు వైద్య ఆరోగ్య శాఖాధికారులు చర్యలు చేపట్టారు.కాగా, ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఇద్దరికి పాజిటివ్ రాగా, బోధన్‌కు చెందిన ఓ వ్యక్తికి పాజిటివ్ నిర్దారణ అయినట్టు జిల్లా వైద్యాఆరోగ్య శాఖ అధికారి తెలిపారు.

Advertisement

Next Story