- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
55 మంది అభ్యర్థులు ఔట్..
by Shyam |
X
దిశ ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు నిర్విరామంగా కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం ప్రారంభమైన రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ప్రక్రియలో సాయంత్రం 7 గంటల వరకు 55 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయ్యారు. అయితే ఇప్పటివరకు గెలుపునకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 1,83,167 ఓట్లను చేరుకోకపోవడంతో కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. ఇదిలావుంటే.. 55 మంది అభ్యర్థులు ఎలిమినేట్ అయిన తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 1,11,190 ఓట్లతో మొదటి స్థానంలో ఉండగా, తీన్మార్ మల్లన్న 83,629 ఓట్లతో రెండో స్థానంలో, ప్రొఫెసర్ కోదండరామ్ 70,472 ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 71 మంది అభ్యర్థులు పోటీ చేస్తే.. ఇప్పటివరకు 55 మంది ఎలిమినేట్ అయ్యారు. ఇంకా 17 మంది పోటీలో ఉన్నారు.
Advertisement
Next Story