- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీలో మరోసారి కాల్పుల కలకలం
దిశ, వెబ్‌డెస్క్ : దేశరాజధానిలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. సీఏఏ ఆందోళనల నేపథ్యంలో ఉత్తర ఢిల్లీలో ఆదివారం నుంచి ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. సీఏఏ వ్యతిరేక, సమర్థకుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాళ్లు విసురుకున్నారు. పోలీసు టియర్ గ్యాస్ కూడా ప్రయోగించిన విషయం విదితమే. ఈ ఘర్షణలకు సంబంధించి వెలుగులోకి వచ్చిన కొన్ని వీడియోలు కలకలం రేపుతున్నాయి. ఎర్రరంగు టీషర్ట్ వేసుకున్న ఓ యువకుడు రెండు సార్లు కాల్పులు జరుపుతూ.. వీడియోలో కనిపించాడు. ఆందోళనలను అదుపులో పెట్టేందుకు యత్నిస్తున్న ఓ పోలీసు.. తుపాకి పట్టుకున్న యువకుడికి ఎదురుగా వెళ్లాడు. తన దగ్గర ఆయుధాలు లేవన్నట్టు సైగ చేస్తూ సమీపించాడు. కానీ, ఆ యువకుడు పోలీసునూ బెదిరించాడు. అతని ముందే గాల్లో కాల్పులు జరిపాడు. ఓ సారి ఎదుటి పక్షంవైపునకు గురిపెట్టాడు. ఇది వరకు ఢిల్లీలో జామియా వర్సిటీ దగ్గర, షహీన్‌బాగ్ ప్రదర్శనా స్థలానికి సమీపంలో కాల్పులు జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఉత్తర ఢిల్లీలోని జాఫ్రాబాద్‌లో సీఏఏను నిరసిస్తూ సుమారు వెయ్యి మంది ప్రదర్శనకు దిగిన విషయం తెలిసిందే. ఈ ప్రంతానికి సమీపంలోని మౌజ్‌పూర్, గోకుల్‌పురి, సీలంపూర్‌లలో ఇరువర్గాల మధ్య ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈ అల్లర్లలో సోమవారం నాటికి ఒక పోలీసు సహా ఐదుగురు వ్యక్తులు మరణించారు.