- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘మహా’మ్మారి.. ఒకే హాస్టల్‌లో 44 మందికి సోకింది
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో కరోనా కేసులు మళ్లీ కలవరపెడుతున్నాయి. వైరస్ విజృంభన నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పాక్షికంగా లాక్‌డౌన్ కూడా అమల్లో ఉంది. అయితే, లాతూర్ జిల్లా ఎంఐడీసీ ప్రాంతంలోని ఓ హాస్టల్‌లో వైరస్ కొరలు చాచింది. ఏకంగా 44 మంది హాస్టల్ విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వెంటనే అప్రమత్తమైన వైద్యాధికారులు వారిని క్వారంటైన్ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సదరు హాస్టల్‌లో 8 నుంచి 10వ తరగతి విద్యార్థులు వసతి పొందుతున్నట్టు సమాచారం. ఇది ఇలా ఉంటే గురువారం లాతూర్‌లో 146 మందికి కరోనా సోకినట్టు పరీక్షల్లో తేలింది. ఇదే సమయంలో మరో 41 మంది వైరస్ నుంచి కోలుకోగా.. మరొకరు మృతి చెందారు. వైరస్ సోకిన వారిలో 91 మంది లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నివాసం ఉంటున్నట్టు అధికారులు గుర్తించారు. కాగా, ఇదే జిల్లాలో కరోనాతో ఇప్పటివరకు 715 మంది చనిపోవడం గమనార్హం.