రామమందిరానికి రూ.41 కోట్ల విరాళం

by Shamantha N |   ( Updated:2020-08-06 08:33:49.0  )
రామమందిరానికి రూ.41 కోట్ల విరాళం
X

దిశ, వెబ్ డెస్క్: అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం బుధవారం ప్రధాని మోదీ చేతుల మీదుగా భూమి పూజ జరిగిన సంగతి తెల్సిందే. ఆలయ నిర్మాణం ప్రారంభం కాక ముందు నుంచే రామమందిరం కోసం భారీగా విరాళాలు వచ్చి చేరుతున్నాయి. మంగళవారం నాటికి రూ.41 కోట్ల విరాళాలు అందినట్లు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధికారికంగా వెల్లడించింది.

మంగళవారం రోజు వరకు రూ.30 కోట్ల విరాళాలు అందగా, బుధవారం ఒక్కరోజే మొరారి బాపు అనే వ్యక్తి మరో రూ.11 కోట్లు ఇచ్చారు. వీటితో కలిపి ఇప్పటి వరకు రూ.41 కోట్ల విరాళాలు అందాయి. అయితే, నిన్నఅందిన విరాళాల లెక్క ఇంకా తేలాల్సి ఉందని ట్రస్టు ట్రెజరర్ స్వామి గోవింద్ దేవ్‌గిరి తెలిపారు. ఈ డబ్బుమొత్తాన్ని రామాలయ నిర్మాణానికి వినియోగించనున్నట్లు ట్రస్ట్ సభ్యులు తెలిపారు. కాగా, అయోధ్య ఆలయ నిర్మాణం పూర్తి కావడానికి మూడున్నరేండ్లు పడుతుందని సమాచారం.

Advertisement

Next Story